దళితుల సమస్యల చర్చకు ప్రత్యేక పార్లమెంట్ " సీపీఎం డిమాండ్
సరళీకృత విధానాల పేరుతో దళితుల బతుకులు దర్భరం చేశారని, స్వాతంత్ర్య వచ్చి దశాబ్దాలు గడిచినా అంటరాని తనం ఇంకా రూపు మాయలేదని, వివిధ రకాలుగా దళిత జాతులు వేధింపులకు గురవుతూనే ఉన్నాయని… వీటన్నింటినీ చర్చించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని సీపీఎం జాతీయ మహాసభ తీర్మానించింది. షెడ్యూలు కులాలు, మతాల సంబంధించి చేసిన చట్టాలను పటిష్టంగా అమలు చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి చర్చించాల్సిన సమయం ఆసన్నమయ్యిందని సభ […]
Advertisement
సరళీకృత విధానాల పేరుతో దళితుల బతుకులు దర్భరం చేశారని, స్వాతంత్ర్య వచ్చి దశాబ్దాలు గడిచినా అంటరాని తనం ఇంకా రూపు మాయలేదని, వివిధ రకాలుగా దళిత జాతులు వేధింపులకు గురవుతూనే ఉన్నాయని… వీటన్నింటినీ చర్చించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని సీపీఎం జాతీయ మహాసభ తీర్మానించింది. షెడ్యూలు కులాలు, మతాల సంబంధించి చేసిన చట్టాలను పటిష్టంగా అమలు చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి చర్చించాల్సిన సమయం ఆసన్నమయ్యిందని సభ పేర్కొంది. పారిశుధ్య పనివారల చట్టం పకడ్బందీగా ఇంకా అమలు కావడం లేదని, వారికి చెందాల్సిన ఉద్యోగాలు భర్తీ కావడం లేదని, వారికి చేరాల్సిన అభివృద్ధి పథకాలు అన్యులు ఎగరేసుకుపోతున్నారని మహాసభ గుర్తు చేసింది.
దళిత క్రిస్టియన్లను, ముస్లింలను షెడ్యూలు కులాలుగా గుర్తించకపోవడం వల్ల షెడ్యూలు కులాలకు అందుతున్న ప్రయోజనాలు వారికి చేకూరడం లేదని… ఇలాంటి విషయాలన్నీ చర్చించడానికి పార్లమెంట్ సమావేశాలు ఒక్కటే సరైన వేదికని మహాసభ భావిస్తున్నట్టు సీపీఎం తీర్మానించింది. కుల వివక్ష లేని సమాజం ఏర్పడడానికి, అత్యాచారాల నిరోధానికి, అంటరానితనం నిర్మూలనకు ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని, కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని సీపీఎం తీర్మానించింది.-పీఆర్
Advertisement