రండి, త్వరపడండి.. వైఎస్సార్టీపీ అప్లికేషన్లకు డెడ్ లైన్

వైఎస్సార్టీపీ అప్లికేషన్లు తీసుకుంటుంటే.. ఇతర పార్టీలనుంచి కూడా మంచి స్పందన ఉందట. ఇతర పార్టీల నేతలు కూడా దాదాపు 50మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని అంటున్నారు.

Advertisement
Update:2023-10-18 13:05 IST

రండి, త్వరపడండి.. వైఎస్సార్టీపీ అప్లికేషన్లకు డెడ్ లైన్

కాంగ్రెస్ లో విలీన ప్రక్రియ ఆగిపోవడంతో తెలంగాణలో వైఎస్సార్టీపీ సొంతగా పోటీ చేయాలని డిసైడ్ అయింది. అనుకున్నదే తడవుగా అప్లికేషన్లను ఆహ్వానించారు ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. తాను రెండు చోట్ల పోటీచేస్తానని, తన భర్త అనిల్, తల్లి విజయమ్మ కూడా అసెంబ్లీ బరిలో ఉంటారని హింట్ ఇచ్చారు. మిగతా స్థానాలకు అప్లికేషన్లు కోరగా.. ఊహించని విధంగా స్పందన వచ్చిందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. నాలుగు రోజులనుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నామని, ఇప్పటి వరకు 377 అప్లికేషన్లు వచ్చాయని, మరో రెండురోజుల్లో గడువు ముగుస్తుందని చెప్పారు.

అత్యధికంగా ఎల్బీనగర్ నుంచి..

ఎల్బీనగర్ నుంచి పోటీ చేసేందుకు వైఎస్సార్టీపీ నాయకులు ఎక్కువమంది ఉత్సాహం చూపించారని, అత్యధికంగా 10 అప్లికేషన్లు అక్కడినుంచే వచ్చాయని చెప్పారు వైఎస్సార్టీసీ నాయకులు. ఒక్కో నియోజకవర్గానికి 5 నుంచి 10లోపు అప్లికేషన్లు వస్తున్నాయని చెప్పారు.

ఇతర పార్టీలనుంచి కూడా..

వైఎస్సార్టీపీ అప్లికేషన్లు తీసుకుంటుంటే.. ఇతర పార్టీలనుంచి కూడా మంచి స్పందన ఉందట. ఇతర పార్టీల నేతలు కూడా దాదాపు 50మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందట. టికెట్ ఖాయమైతే షర్మిల పార్టీలో చేరి పోటీ చేయడానికి చాలామంది ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తామని, ఆ తర్వాత పార్టీ అధ్యక్షురాలు షర్మిల సుడిగాలి పర్యటన ఉంటుందని అంటున్నారు. రెండు రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుందని, త్వరలోనే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని అంటున్నారు వైఎస్సార్టీపీ నేతలు. 

Tags:    
Advertisement

Similar News