నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు
మహాసభలకు హాజరుకానున్న ఏపీ, తెలంగాణ సీఎం సహా ప్రముఖులు
Advertisement
నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరగనున్నాయి. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలకు సర్వం సిద్ధమైంది. తెలుగు భాష ప్రాముఖ్యం, సంస్కృతి విశేషాలతో పాటు పలు రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు సహా వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు హాజరుకానున్నారు. రాజకీయ నాయకులు, సినీ కళాకారులు, సాహితీవేత్తలు, వ్యాపార ప్రముఖులు కూడా పాల్గొననున్నట్లు ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్ తెలిపారు. 1992లో ప్రారంభమైన ప్రపంచ తెలుగు సమాఖ్య రెండేళ్లకోసారి మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఈ మహాసభలు జరగడం రెండోసారి అని వివరించారు.
Advertisement