తెలంగాణలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. సవరించిన ఓటర్ల జాబితాను సోమవారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విడుదల చేశారు. మొత్తం ఓటర్లలో పురుషులు 1,66,41,489 మంది కాగా స్త్రీలు 1,68,67,735 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,829 మంది ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్లు 5,45,026 మంది ఉన్నారు. 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు 2,22,091 మంది ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 3,591 మంది ఉన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న ఓటర్లు (శారీరక వైకల్యం కలవారు) 5,26,993 మంది ఉన్నారని సీఈవో వెల్లడించిన వివరాల్లో పొందుపరిచారు. శేరిలింగంపల్లిలో రాష్ట్రంలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు ఉండగా, భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.
Advertisement