టన్నెల్‌లో చిక్కుకున్న 8మందిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాం

రెస్క్కూ బృందాలు ఈ రాత్రి ఘటనా స్థలికి చేరుకుంటాయన్న ఉత్తమ్‌

Advertisement
Update:2025-02-22 17:21 IST

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద శనివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకున్నది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాద స్థలిని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణా రెడ్డి పరిశీలించారు. అనంతరం అధికారులో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 8 గంటలకు కార్మికులు టన్నెల్‌ లోపలికి వెళ్లారు. 8.30 గంటలకు బోరింగ్‌ మిషన్‌ ఆన్‌ చేశారు టన్నెల్‌ ఒకవైపు నీరు లీకై మట్టి కుంగి పెద్ద శబ్దం వచ్చింది. టీబీఎం ఆపరేటర్‌ ప్రమాదాన్ని ముందే పసిగట్టారు.

వెంటనే అప్రమత్తమై 42 మంది కార్మికులను బైటికి తీసుకొచ్చారు. బోరింగ్‌ మిషన్‌ ముందున్న 8 మంది చిక్కుకు పోయారు. వారిని కాపాడటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. వారి ప్రాణాలు కాపాడటానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాం. ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ఘటన జరిగితే టన్నెల్‌ వారిని రెస్క్కూ చేసిన ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడి. టన్నెల్‌ చిక్కుకుపోయిన వారు ఉత్తర ప్రదేశ్‌, ఝార్ఖండ్‌ వాసులు. వారిలో ఒక ప్రాజెక్టు ఇంజినీర్‌, ఫీల్డ్‌ ఇంజినీర్‌, నలుగురు కార్మికులు, జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌కు చెందిన ఇద్దరు బోరింగ్‌ మిషన్‌ ఆపరేటర్లు ఉన్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారికి వెంటిలేషన్‌ ఇబ్బంది లేదు. 14 కిలోమీటర్ల లోపల ఇరుక్కుపోవడంతో వారిని బైటికి తీసుకురావడం సవాల్‌గా మారింది. రెస్క్కూ బృందాలు ఈ రాత్రి ఘటనా స్థలికి చేరుకుంటాయని ఉత్తమ్‌ తెలిపారు. 

గుర్‌జిత్‌ సింగ్‌ (పంజాబ్‌), సన్నీత్‌సింగ్‌ (జమ్ముకశ్మీర్‌)ఆపరేటర్లు , శ్రీనివాసులు (యూపీ), మనోజ్‌ కుమార్‌ (యూపీ) ప్రాజెక్టు ఇంజినీర్లు, సందీప్‌ సాహూ (ఝార్ఖండ్‌), సంతోష్‌ సాహూ (ఝార్ఖండ్‌), జట్కా హీరాన్‌ (ఝార్ఖండ్‌) కార్మికులు .

Tags:    
Advertisement

Similar News