త్వరలో అంగన్ వాడీల్లో 14,236 కొలువుల భర్తీ!
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ జారీ రంగం సిద్ధం
Advertisement
అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 14,236 పోస్టుల భర్తీకి సంబంధించి ఫైలుపై మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. రాష్ట్రంలో భారీస్థాయిలో అంగన్‌వాడీ కొలువుల భర్తీ చేయడం మొదటిసారి అంటున్నారు. అంగన్‌వాడీలను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మంత్రి తెలిపారు.
Advertisement