ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు నిలిపి వేయాలని మహిళల నిరసన

నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును నిలిపివేయాలని మహిళలు హైవేపై రాస్తారోకో నిర్వహించారు.

Advertisement
Update:2024-11-26 15:38 IST

నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును నిలిపివేయాలని మహిళలు నిరసన చేపట్టారు. భారీ సంఖ్యలో మహిళలు జాతీయ రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. దిలావర్‌పూర్‌లో నిర్మించే ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా మహిళలు వందల సంఖ్యలో కుటుంబ సమేతంగా నేషల్ హైవేపై ధర్నా నిర్వహించారు. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేతలు కనిపించడంలేదని ప్లకార్డులు ప్రదర్శించారు.

పరిశ్రమ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గత కొన్ని రోజుల క్రితమే లగచర్లలో రేవంత్ సర్కార్‌కి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లగచర్ల ఫార్మా పరిశ్రమల ఏర్పాటను వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసనలు చేపట్టారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. 

Tags:    
Advertisement

Similar News