తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం..మూడు కేటగిరీలుగా విభజన

తెలంగాణలో కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది.;

Advertisement
Update:2025-03-05 19:37 IST

తెలంగాణలో కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులను మూడు కేటగిరీలుగా విభజించాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఒరిజినల్ నాయకులను ఒక గ్రూప్. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారిని రెండో గ్రూప్. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని మూడో గ్రూప్. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో ఈ కేటగిరీల వారీగా ప్రాధాన్యత దక్కనున్నుది.పదేళ్లు పార్టీలో ఉన్నవారి లిస్ట్‌ కోరిన ఇన్‌చార్జ్‌ మీనాక్షి. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది. మీనాక్షి నటరాజన్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ వచ్చినప్పుడు నుంచి హస్తం పార్టీ రాజకీయ పరిణామలు వేగంగా మారుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News