ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. 9వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యం

ప్రస్తుతం 4,040 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి;

Advertisement
Update:2025-03-05 07:48 IST

కరీంనగర్‌-నిజామాబాద్‌-మెదక్‌-ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 9 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. తొమ్మిదో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,245 ఓట్లు వచ్చాయి. దీంతో 9 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయనకు మొత్తంగా 63,871 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌ రెడ్డి 9వ రౌండ్‌లో 6,921 ఓట్లు సాధించాయి. 9 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయనకు మొత్తంగా 59,831 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,040 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 2,24,000 కాగా.. ఇప్పటివరకు 1,89,000 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 

చెల్లని ఓట్లతో చిక్కు

ఈసారి పట్టభద్రుల ఓట్ల లెక్కింపులో ప్రాథమికంగా 21 వేల పైచిలుకు బ్యాలెట్‌ పత్రాలను చెల్లని ఓట్ల జాబితాలో చేర్చారు. వీటి విషయంలో అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మరోసారి వీటిని పరిశీలించి పక్కగా చెల్లని ఓట్లు ఎన్ని అనేది ఎన్నికల అధికారి వెల్లడిస్తారు. అందుకే గెలుపు కోటా ఎంత అనేది ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుం ఆయా రౌండ్ల లెక్కింపు సమయంలోనూ 5-10 చెల్లని ఓట్లు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరస్కరణకు గురైన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

10 వ రౌండ్ ఫలితాలు

1.అంజిరెడ్డి - 6869

(10 రౌండ్లు కలిపి (70740)

2.నరేందర్ రెడ్డి- 6347

(10 రౌండ్లు కలిపి (66178)

3.ప్రసన్న హరికృష్ణ - 5952

(10 రౌండ్లు కలిపి (56946)

4.రవీందర్ సింగ్ - 308

(10 రౌండ్లు కలిపి (1948)

5.మహమ్మద్ ముస్తాక్ అలీ - 379

(10 రౌండ్లు కలిపి (2504)

6.యాదగిరి శేఖర్ రావు - 324

(10 రౌండ్లు కలిపి (3439)

మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 2,24,000

ఇప్పటి వరకు సుమారు 2,10,000 ఓట్లు లెక్కించారు.

Tags:    
Advertisement

Similar News