నా ఓటమికి సీఎం రేవంత్ రెడ్డి కారణం కాదు : వంశీచందర్

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను వంశీచందర్ రెడ్డి ఖండించారు.;

Advertisement
Update:2025-03-05 15:38 IST

కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అని సీడబ్ల్యూసీ మెంబర్ వంశీచందర్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ లోక్ సభ స్థానంలో నా ఓటమికి సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశారని మల్లన్న చేసిన వ్యాఖ్యలను నిజం కావుని కేవలం తన ఉనికి కోసమే చేశాడని తెలిపాడు. నేను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్నది అధిష్టానం నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. నాగెలుపు కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో శ్రమించారని ఆయన అన్నారు.

బీఆర్ఎస్ , బీజేపీ కుమ్మక్కు రాజకీయాలలో భాగంగానే మహబూబ్ నగర్ లో బీజేపీ గెలిచించన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉండడంతో ఆమెను బయటకు తెచ్చేందుకు బీఆర్ఎస్, బీజేపీకి అమ్ముడుపోయిందని గతంలో కేసీఆర్ లాంటి వాళ్ళు ఎంపీగా పని చేసిన మహబూబ్ నగర్ లో సిట్టింగ్ బీఆర్ఎస్ సీట్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయి బీజేపీ కి మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు నా గెలుపు కోసం సమిష్ట కృషి చేశారన్నారు.

Tags:    
Advertisement

Similar News