ఆడపడుచు అక్రమ సంబంధం ప్రశ్నించినందుకు హత్య

మలక్‌పేటలో వివాహిత శిరీష హత్య కేసులో సంచలన విషయాలను ఏసీపీ వెల్లడించారు;

Advertisement
Update:2025-03-05 20:12 IST

హైదరాబాద్ మలక్‌పేటలో వివాహిత శిరీష హత్య కేసులో సంచలన విషయాలను ఏసీపీ శ్యాంసుందర్ వెల్లడించారు. ఆడపడుచు అక్రమ సంబంధం ప్రశ్నించినందున శిరీషను హతమార్చారని ఏసీపీ తెలిపారు.ఈ కేసులో శిరీష భర్త వినయ్ కుమార్, అతని సోదరి సరిత, మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు శిరీష నర్సుగా పని చేస్తోందని, పలుచోట్ల ఉద్యోగాలు మానేసిందని తెలిపారు. తరుచూ ఉద్యోగాలు మానివేస్తున్నందుకు సరిత నిలదీసింది. "నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. నీ సంగతి తేలుస్తా" అంటూ శిరీష కూడా ఎదురు దాడికి దిగిందని, దీంతో పరస్పరం ఘర్షణ దిగినట్లు తెలిపారు. తాజాగా వివాహేతర సంబంధ కోణం వెలుగుచూసింది. ఆ గుట్టు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో శిరీషను సరితే హత్య చేసినట్లు తేలింది. వినయ్‌ సోదరి సరిత భర్త ఒమన్‌లో ఉంటాడు.

దీంతో సరిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో శిరీష.. పరువు పోతుందని ఆమెను మందలించింది. ఇది మనసులో పెట్టుకుని కోపంతో రగిలిపోయిన సరిత.. అవకాశం కోసం ఎదురు చూసిందిఘర్షణ తర్వాత కాసేపటికి, శిరీష తనకు నిద్రపట్టడం లేదంటూ సరిత వద్ద ఉంటే మత్తు ఇంజెక్షన్ అడిగి తీసుకుందని, శిరీష మీద కోపంతో డోసు ఎక్కువగా ఉన్న ఇంజెక్షన్ ఇచ్చిందని ఏసీపీ తెలిపారు. శిరీష మత్తులోకి జారుకున్న తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి సరిత చంపేసినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని సరిత తన భర్తకు, సోదరుడికి చెప్పిందని మీడియాకు తెలిపారు.వారు అంబులెన్సును పిలిపించి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తన గురించి తన భర్తకు శిరీష చెడుగా చెబుతుందనే భయంతో హతమార్చినట్లు పోలీసుల దర్యాఫ్తులో వెల్లడైందని ఏసీపీ పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News