మా ఉద్యోగాలు తీసేశారు.. మాకు అండగా నిలవండి

మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ కు ఏఈవోల విజ్ఞప్తి

Advertisement
Update:2024-11-05 17:53 IST

అకారణంగా తమను ఉద్యోగాల నుంచి తొలగించారని.. తమ సమస్యలను పరిగణలోకి తీసుకొని తమకు అండగా నిలువాలని మహిళా అగ్రికల్చర్‌ ఎక్స్‌ టెన్షన్‌ ఆఫీసర్లు (ఏఈవోలు) మహిళా కమిషన్‌ ను వేడుకున్నారు. మంగళవారం తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నేరెళ్ల శారదను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో ఎలాంటి సమస్యలు ఎదరవుతున్నాయో వివరించారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, అధికారులు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఏఈవోలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని చైర్‌ పర్సన్‌ శారద ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News