చలికాలం ఎఫెక్ట్: హైదరాబాద్‌లో పెరిగిన కాలుష్యం

బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, ప్యారడైజ్, చార్మినార్, జీడిమెట్ల సహా అనేక ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తరు AQI (101-200) ఉంది. ఊపిరితిత్తులు, గుండె రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగించేంతగా గాలిలో కాలుష్యం దట్టంగా ఉంది.

Advertisement
Update:2023-01-29 09:15 IST

ఈ శీతాకాలంలో హైదరాబాద్ నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) దారుణంగా క్షీణించింది.

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (TSPSCB) నివేదిక ప్రకారం గత ఏడాది జూన్, అక్టోబర్ మధ్య హైదరాబాద్ లో కాలుష్య స్థాయిలు మెరుగుపడింది. అయితే, శీతాకాలం ప్రారంభమై ఉష్ణోగ్రతలు క్షీణించడం ప్రారంభం కాగానే, కాలుష్య స్థాయిలు పెరుగుతూ పోయాయి.

నెహ్రూ జూలాజికల్ పార్క్, పాశమైలారం, ICRISAT ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. AQI స్థాయిలు రెండు నెలలుగా దారుణంగా ఉన్నాయి. వాతావరణంలో ప్రధాన కాలుష్య పదార్థాలు PM2.5, PM10, నైట్రోజన్ డయాక్సైడ్ అధిక స్థాయిలో నమోదయ్యాయి.

జూ పార్క్‌లో AQI స్థాయి నవంబర్‌లో 273గా ఉంది, డిసెంబర్‌లో ఇది 236గా ఉంది. నవంబర్‌లో పాశమైలారం గాలి నాణ్యత 245గా ఉండగా డిశంబర్ నెలలో అది 187గా ఉంది.

బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, ప్యారడైజ్, చార్మినార్, జీడిమెట్ల సహా అనేక ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తరు AQI (101-200) ఉంది. ఊపిరితిత్తులు, గుండె రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగించేంతగా గాలిలో కాలుష్యం దట్టంగా ఉంది.

మరోవైపు, అబిడ్స్, మాదాపూర్, కూకట్‌పల్లి, సైనిక్‌పురి, చిక్కడ్‌పల్లి, ట్యాంక్ బండ్‌లో AQI స్థాయిలు సంతృప్తికరంగా ఉన్నాయి.

ఉష్ణోగ్రత తగ్గుదలతో గాలి వేగం తక్కువగా ఉంటుంది. ఇది కాలుష్య కారకాలను భూమికి దగ్గరగా తీసుకువస్తుంది.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) నిర్దేషించిన‌ ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-50 మధ్య మంచిది, 51, 100 మధ్య సంతృప్తికరమైనది, 101, 200 మధ్య మధ్యస్థం, 201, 300 మధ్య పూర్, 301, 400 మధ్య ప్రమాదకరమైనది, 400 పైగా అత్యంత ప్రమాదకరమైనది. 

Tags:    
Advertisement

Similar News