మా అబ్బాయిని కొట్టి చంపేస్తారా ? మంత్రి మల్లా రెడ్డి ఆగ్రహం
తెలంగాణ కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. మరో వైపు మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి వద్ద ధర్మాకు దిగారు. తన కొడుకును చూడనివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడిని సీఆర్‌పీఎఫ్ బలగాలతో కొట్టించారని మల్లా రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ కార్మిక శాక మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. ఐటి శాఖ అధికారులు మంగళవారం నుంచి సోదాలు చేస్తున్నారు. దీంతో మహేందర్ రెడ్డి కొంపల్లిలోని ఇంట్లోనే ఉండిపోయారు. ఛాతి నొప్పి రావడంతో మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
మహేందర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఎడమ భుజం, చెస్ట్ పెయిన్‌తో ఆస్పత్రికి వచ్చారని తెలిపారు. ఈసీజీలో కొద్దిగా తేడాలు ఉన్నాయని.. వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహేందర్ రెడ్డి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. ఒత్తిడి వల్ల సరైన విశ్రాంతి లేకపోవడంతో ఇలా జరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
గతంలో కూడా మహేందర్ రెడ్డికి ఈ సమస్య ఉండి ఉండొచ్చని చెప్పారు. అప్పుడు నిర్లక్ష్యం చేసి ఉంటారని.. ఇప్పుడు ఒత్తిడి ఎక్కువ కావడంతో పెయిన్ బయటకు వచ్చి ఉండొచ్చని చెప్పారు. ఈ రోజు సాయంత్రం వరకు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిపారు.
మరో వైపు మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి వద్ద ధర్మాకు దిగారు. తన కొడుకును చూడనివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుమారుడిని సీఆర్‌పీఎఫ్ బలగాలతో కొట్టించారని మల్లా రెడ్డి ఆరోపించారు. తన కుమారుడికి ఏమవుతుందోనని , అతన్ని కొట్టి చంపేస్తారని భయంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా మల్లారెడ్డి ఆస్తులకు సంబంధించి అధికారులు రెండో రోజు కూడా సోదాలు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. ఐటి అధికారులు మల్లారెడ్డి సన్నిహితుడు సంతోష్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సంతోష్ రెడ్డి ఇంటి తలుపులు తీయలేదు. దీంతో అధికారులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. పెద్ద యెత్తున సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.
మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లోనే కాకుండా అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరుపుతున్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థల ఆర్థిక లావాదేవీలను అధికారులుపరిశీలిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి వరకు సోదాలు నిర్వహించిన ఐటి అధికారులు మంగళవారం రాత్రి అక్కడే నిద్రించారని సమాచారం.