గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తెలంగాణ
ఐఐటీ హైదరాబాద్ విద్యా సంస్థ కాదు.. ఆవిష్కరణకు కేంద్రబిందువు అన్న డిప్యూటీ సీఎం
Advertisement
దేశ ప్రగతిలో ఐఐటీలది కీలకపాత్ర అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఐఐటీ హైదరాబాద్ విద్యా సంస్థ కాదు.. ఆవిష్కరణకు కేంద్రబిందువు అని కొనియాడారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ వర్క్ షాప్‌ను ఆయన ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో గల ఐఐటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి, రాష్ట్రానికి సేవల చేసేలా ఎదగాలని సూచించారు.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారుస్తామని చెపపారు. 2030 నాటికి 2 వేల మెగావాట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్లోటింగ్ సోలార్‌పై పెట్టుబడులు పెడుతామన్నారు.
Advertisement