NDTVని ఇకపై ఫాలో అవను.. కేటీఆర్
ఇకపై NDTV చూడబోమంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ అంశం పై స్పందించారు. తాను ఇక NDTV ని ఫాలో అవబోనని ప్రకటించారు. ఇప్పటివరకు నిష్పాక్షికంగా వార్తలను అందించినందుకు NDTV ని కేటీఆర్ ప్రశంసించారు.
ఎలక్ట్రానిక్ మీడియాలో మొదటి తరం జర్నలిస్టు, NDTV ఛానల్ ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ ఆ ఛానల్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన భార్య రాధికా రాయ్ కూడా డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఇక NDTV పూర్తిగా అదానీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. నిష్పాక్షిక, సమతూల్య వార్తలకు పేరు గాంచిన NDTV ఇక నరేంద్ర మోడీ భజనలో మునిగి తేలనుందినే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
NDTV నుంచి ప్రణయ్ రాయ్ తప్పుకోవడం, ఆ ఛానల్ పూర్తిగా అదానీ చేతుల్లోకి వెళ్ళడం పట్ల స్వతంత్ర వార్తలను ప్రేమించే లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారు. ఇకపై ఒకే పార్టీకి కొమ్ముకాయబోయే, ఒకే వ్యక్తిని దేవుడిగా చూపించబోయే ఆ ఛానల్ ను చూడబోమంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ అంశం పై స్పందించారు. తాను ఇక NDTV ని ఫాలో అవబోనని ప్రకటించారు. ఇప్పటివరకు నిష్పాక్షికంగా వార్తలను అందించినందుకు NDTV ని కేటీఆర్ ప్రశంసించారు.
నిజం చెప్పాలంటే భారతదేశంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజం ఆధ్యులలో ప్రణయ్ రాయ్ ఒకరు. NDTV ప్రారంభించకముందే ఆయన దూరదర్శన్ లో ఎన్నికల విశ్లేషణ చేసేవారు. ఆ తర్వాత 1988 లో NDTV ని స్థాపించారు. అందులోంచి వచ్చిన చాలా మంది జర్నలిస్టులు ఆ తర్వాత కాలంలో అనేక న్యూస్ ఛానల్స్ కు సీఈఓలు, చీఫ్ ఎడిటర్స్ అయ్యారు.