దాగుడుమూతలు ఎందుకు.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయండి

వాడివేడిగా తెలంగాణ జన సమితి పార్టీ కార్యవర్గ సమావేశం

Advertisement
Update:2025-02-10 11:07 IST

నాంపల్లి తెలంగాణ జన సమితి కార్యాలయంలో ఆ పార్టీ కార్యవర్గ సమావేశం వాడివేడిగా జరిగింది . ఎమ్మెల్సీ కోదండరాం ఎదుటే కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జన సమితి పార్టీ కార్యకర్తలు, నాయకుల బహిరంగ విమర్శలు చేశారు.14 నెలల్లో కేవలం ఒక్క ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. పదవులపై ఎందుకు గట్టిగా మాట్లాడడం లేదని పార్టీ నేతలు కోదండరాం ను నిలదీశారు .పదవి మీకు ఒక్కరికి వస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నించారు. మిగతా వారి పదవుల సంగతేంటని నిలదీశారు. సీఎల్పీ సమావేశానికి మనం ఎందుకు హాజరుకావాలని? ఇంకా దాగుడు మూతలు అవసరమా? పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయండని ఫైర్‌ అయ్యారు.

పార్టీ బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి నీ ఎందుకు కల్పించడం లేదని, కనీసం అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం అంత బిజీ ఎందుకు?అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరుపై నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు విరమించుకోవాలని...స్వతంత్రంగా పనిచేస్తేనే పార్టీ బతుకుతుందని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నామినేటెడ్ పదవులతో పాటు రెండు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. పార్టీ అధినేత ముందే కార్యకర్తలు నాయకులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇకపై ఉపేక్షించేది లేదని.. ప్రభుత్వంపై తిరగబడితేనే రావాల్సిన పదవులు వస్తాయన్నట్టు తెలుస్తోంది.



Tags:    
Advertisement

Similar News