బీరు బాబులకు సర్కార్ షాక్
రాష్ట్రంలో బీర్ల ధరలు 15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. నేటి నుంచి అమల్లోకి
తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలు 15 శాతం పెరగనున్నాయి. విశ్రాంత జడ్జి జస్టిస్ జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ సిఫార్సు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సవరణతో ప్రస్తుతం ఉన్న ఎమ్మార్పీపై 15 శాతం పెరుగుతుంది. కొత్త ధరలు నేటి అమల్లోకి వచ్చాయి.
గత ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు పెంచినప్పుడుపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం ధరలు తక్కువగా ఉండేవని, తెలంగాణ సమాజానికి సంక్షేమాన్ని అమలు చేయాల్సిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం లిక్కరే నమ్మకున్నాదని అడ్డదిడ్డంగా మాట్లాడారు. మద్యం ధరలు పెంచి ఫించన్ పైసలు గుంజుకుంటున్నదని మాట్లాడిన రేవంత్ ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారని నెటీజన్లు ప్రశ్నిస్తున్నారు.