నేడు హనుమకొండకు రాహుల్
హనుమకొండలో పార్టీ శ్రేణులతో రాహుల్ భేటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హనుమకొండకు రానున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్న రాహుల్.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండకు వెళ్తారు. సాయంత్రం 5.30 గంటలకు పార్టీ శ్రేణులతో రాహుల్ సమావేశం కానున్నారు. రాహుల్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీగా భద్రతా ఏర్పాటు చేశారు. హనుమకొండ పర్యటన అనంతరం రాహుల్ గాంధీ ఇవాళ రాత్రి రైలులో తమిళనాడు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల సీఎం అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, రాజ్యసభ సభ్యులు అభిషేక్ సింఘ్వీ పాల్గొన్న ఈ సమావేశంలో వాడీవేడీ చర్చ జరిగినట్లు సమాచారం. కొంతమంది మంత్రుల తీరుపై ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పది ఎమ్మెల్యేలు ఓ హోటల్‌లో భేటీ కావడంపై అధిష్ఠానం ఆరా తీసింది. సొంతపార్టీ ఎమ్మెల్యేలే మంత్రులపై గుర్రుగా ఉండటాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకున్నది. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై విపక్షాలతోపాటు బీసీ, ఎస్సీ సంఘాల అభ్యంతరాలు, పార్టీలో అసమ్మతి తదితర అంశాల నేపథ్యంలో రాహుల్ హనుమకొండలో పార్టీ శ్రేణులతో భేటీపై ప్రాధాన్యం సంతరించుకున్నది.