లోక్‌సభలో బీఆర్ఎస్ ఎందుకుండాలంటే.. కేసీఆర్ కొత్త నినాదం..!

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఎందుకుండాలనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది గులాబీ పార్టీ. లోక్‌సభలో బీఆర్ఎస్‌ ప్రాతినిథ్యం లేకపోతే తెలంగాణ అనే పదమే వినిపించదని చెప్తోంది.

Advertisement
Update:2024-01-08 15:56 IST

అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంతో లోక్‌సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తోంది బీఆర్ఎస్‌. ఇందులో భాగంగా ఇప్పటికే పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. కార్యకర్తలు, నేతల నుంచి అభిప్రాయాలు సేక‌రిస్తోంది.

దీంతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఎందుకుండాలనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది గులాబీ పార్టీ. లోక్‌సభలో బీఆర్ఎస్‌ ప్రాతినిథ్యం లేకపోతే తెలంగాణ అనే పదమే వినిపించదని చెప్తోంది. ఇందుకు ఉదాహరణగా గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు తెలంగాణకు సంబంధించి ఎన్ని ప్రశ్నలు అడిగారనే వివరాలను బయటపెట్టింది. రాహుల్‌ గాంధీ ఏనాడూ తెలంగాణకు సంబంధించిన సమస్యలతో పాటు విభజన సమస్యలపై పార్లమెంట్‌లో ప్రస్తావించింది లేదని చెప్తోంది బీఆర్ఎస్‌. కాంగ్రెస్‌, బీజేపీలకు తెలంగాణ మిగతా రాష్ట్రాల్లాగే ఒక రాష్ట్రమని.. కానీ బీఆర్ఎస్‌కు అలా కాదని చెప్తోంది.


గత పదేళ్లలో పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌ ఎంపీలు 4 వేల 754 ప్రశ్నలు అడిగారని.. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు 1,271, బీజేపీ ఎంపీలు కేవలం 190 ప్రశ్నలు మాత్రమే అడిగారని బీఆర్ఎస్ చెప్తోంది. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ వాయిస్‌ వినిపించేందుకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News