త్వరలో తెలంగాణలో WHO, WEF కేంద్రాలు: కేటీఆర్

జీనోమ్ వ్యాలీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు తెలంగాణలో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు గ్లాండ్ ఫార్మా, డాక్టర్ సైరస్ పూనావల్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించాయి.

Advertisement
Update:2023-02-22 07:28 IST

రెండు అంతర్జాతీయ సంస్థలు... ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) , ప్రపంచ ఆర్థిక వేదిక(WEF)లు హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని, వీటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంఆర్‌ఎన్‌ఏ ప్రాజెక్టు కూడా ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

జీనోమ్ వ్యాలీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు తెలంగాణలో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు గ్లాండ్ ఫార్మా, డాక్టర్ సైరస్ పూనావల్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించాయి.

ఫిబ్రవరి 24 నుండి 26 వరకు బయోఏషియా 20వ ఎడిషన్ ఇండస్ట్రీ ఈవెంట్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

గత బయోఏషియా సమావేశాల వల్ల రాష్ట్రం రూ. 25,000 కోట్ల పెట్టుబడులను సాధించిందని, ద్వైపాక్షిక సహకార ఒప్పందాలు, అవగాహనా ఒప్పందాలు జరిగాయని కేటీఆర్ తెలిపారు.

స్విట్జర్లాండ్, నార్వే, థాయ్‌లాండ్, కొరియా, అర్జెంటీనా, స్పెయిన్, యుకె, జర్మనీ, దక్షిణాఫ్రికా తదితర దేశాల పారిశ్రామిక ప్రతినిధులతో కలిసి మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బయోఏషియా సమావేశాల్లో నోబెల్ గ్రహీతలు, లాస్కర్ అవార్డు విజేతలు, బ్రేక్‌త్రూ ప్రైజ్ విజేతలు కూడా పాల్గొంటారు.

ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీపై పరిశోధనకు చేసినందుకు గాను ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్‌కు అందజేయనున్నారు.

ఈవెంట్‌లో 175 మంది ఎగ్జిబిటర్లు కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో స్టార్టప్‌ల కోసం 'ఇన్నోవేటివ్ జోన్'ను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం కోసం 400 నామినేషన్లు అందాయి. వాటిలో 75 షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి.

Tags:    
Advertisement

Similar News