కేటీఆర్ పరిచయం చేసిన ఈ జిందం స‌త్త‌మ్మ ఎవరు ?

ఓ అవ్వ నుపరిచయం చేస్తూ ఆమె ఫోటోలతో సహా తెల‍ంగాణ ఐటీ శాఖా మ‍త్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ పరిచయ‍ం చేశారంటే ఆమేమీ బిజినెస్ ఉమెన్ కాదు....పెద్ద రాజకీయ నాయకురాలు కూడా కాదు.

Advertisement
Update:2022-07-17 16:05 IST

ఓ అవ్వ నుపరిచయం చేస్తూ ఆమె ఫోటోలతో సహా తెల‍ంగాణ ఐటీ శాఖా మ‍త్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ పరిచయ‍ం చేశారంటే ఆమేమీ బిజినెస్ ఉమెన్ కాదు....పెద్ద రాజకీయ నాయకురాలు కూడా కాదు....ఆమె ఓ చిన్న ఊరిలో సాధారణ జీవితం గడిపే ఓ మహిళ. మరి ఆమెను కేటీఆర్ పనిగట్టుకొని ప్రపంచానికి ఎందుకు పరిచయం చేసినట్టు ? ఎందుకంటే ఆమెకు తెలంగాణ అంటే పిచ్చి, తెలంగాణ పోరాట యోధుడు కేసీఆర్ అంటే అడిగితే ప్రాణాలిచ్చేంత వీరాభిమానం..

ఆమె పేరు జిందం స‌త్త‌మ్మ. ఆమెది కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాజన్న సిరిసిల్లా జిల్లా. మలి విడత ప్రత్యేక తెలంగాణ పోరాటం ప్రారంభమైనప్పటినుంచి ఆమె ప్రతి మలుపులో ఉంది.ప్రతి పోరాటంలో అడుగు కలిపింది. టీఆరెస్ ఇచ్చిన ప్రతిపిలుపుకు ఆమె స్పందించింది. ఇప్పటికీ ఆమె టీఆరెస్ కు మద్దతుగా నిలబడింది.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ఆమెను పరిచయం చేస్తూ ఓ ట్వీట్ చేశారు.ఉద్య‌మ స‌మయంలో త‌న‌తో క‌లిసి క‌దం తొక్కిన స‌త్తమ్మ ఫొటోల‌ను కేటీఆర్ త‌న ట్వీట్‌కు జ‌త చేశారు.

''నా జిల్లాకు చెందిన ఒక ప్రత్యేకమైన TRS మద్దతుదారుని ,KCR హార్డ్ కోర్ అభిమానిని మీకు పరిచయం చేస్తున్నాను; ఆమె పేరు జిందం సత్తమ్మ.

ఆమె తెలంగాణ ఆందోళనలో చురుగ్గా పాల్గొంది. నాటి నుంచి నేటి దాకా ఆమె నాకు మద్దతుగా నిలబడింది. అటువంటి షరతులు లేని ఆప్యాయత, మద్దతు అమూల్యమైనది'' అని ట్వీట్ చేశారు కేటీఆర్.


Tags:    
Advertisement

Similar News