''బీజేపీ అయినా, ముస్లిం లీగ్ అయినా... అతివాదాన్ని నేను వ్యతిరేకిస్తాను’’ డైరెక్టర్ రాజమౌళి
"RRR" చరిత్రను వక్రీకరించిదని అన్నట్లయితే, "మాయాబజార్" కూడా వక్రీకరించినట్టే'' అని రాజమౌళి అన్నారు.
దర్శకుడు రాజమౌళి బీజేపీ, ఆరెస్సెస్ ఎజెండాను తన సినిమాల ద్వారా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలను రాజమౌళి తీవ్రంగా ఖండించారు.
''నేను తీవ్రవాదాన్ని ద్వేషిస్తాను, అది B.J.P., ముస్లిం లీగ్ లేదా మరేదైనా కానీ నేను సమాజంలోని తీవ్ర వాదాన్ని, అలాంటి వ్యక్తులను ద్వేషిస్తాను. అది నేను ఇవ్వగల వివరణ.'' అన్నారాయన
న్యూయార్కర్ అనే వెబ్ సైట్ కుఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ,
''అన్నిటికన్నా ముందు “బాహుబలి” సినిమా కల్పితమని అందరికీ తెలుసు. కాబట్టి ప్రస్తుత బిజెపి ఎజెండాకు అనుగుణంగా చారిత్రక పాత్రలను చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించడం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. “RRR” విషయానికొస్తే, ఇది డాక్యుమెంటరీ కాదు. చారిత్రక పాఠం కాదు. ఇది గతంలో చాలాసార్లు చేసినట్టే కల్పిత పాత్రలతో చేసిన సినిమా "RRR" చరిత్రను వక్రీకరించిదని అన్నట్లయితే, "మాయాబజార్" కూడా వక్రీకరించినట్టే'' అని రాజమౌళి అన్నారు.
''నేను B.J.P కి మద్దతిస్తున్నానని, లేదా B.J.P. ఎజెండాను ప్రచారం చేస్తున్నానని ఆరోపిస్తున్న వ్యక్తులకు నేను మరొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మేము భీమ్ క్యారెక్టర్ డిజైన్‌ను మొదట విడుదల చేసినప్పుడు, నేను అతనికి ఒక ముస్లిం స్కల్ క్యాప్ ధరించి చూపించాను. ఆ తర్వాత "RRR" ప్రదర్శించే థియేటర్‌లను తగలబెడతానని ఒక బి.జె.పి. నాయకుడు బెదిరించాడు. మేము టోపీని తీసివేయకపోతే నన్ను రోడ్డు మీద కొడతానని చెప్పాడు. కాబట్టి నేను B.J.Pకి మద్దతుదారునా కానా అని ప్రజలు స్వయంగా నిర్ణయించుకోవచ్చు.'' అని రాజమౌళి వివరణ ఇచ్చారు.