కౌశిక్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పారిపోయిన బంజారాహిల్స్ సీఐ

బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు

Advertisement
Update:2024-12-04 16:41 IST

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి పై పోలీసులకు కంప్లైంట్ చేసేందుకు బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే అదే సమయంలో తనకు వేరే పని ఉందంటూ సీఐ స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తన కంప్లైంట్ తీసుకోవాలని కౌశిక్ రెడ్డి ఇన్‌స్పెక్టర్ వెంటబడ్డారు. ఇన్‌స్పెక్టర్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

దీంతో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి సమస్యను సర్దుమణిగించారు. మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాఫిర్యాదు చేయడానికి వస్తే పారిపోతున్నారు అని కౌశిక్ రెడ్డి తెలిపారు. అయితే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వస్తున్నానని అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఏసీపీ తాను రాకన్నా ముందే పారిపోయారని.. తాను వస్తున్నది చూసి సీఐ పారిపోతున్నాడు అని అన్నారు. ఒక బ్రోకర్ చెబితే.. బ్రోతల్ గాడు నిన్న హరీష్ రావు మీద కేసుపెడుతాడని కౌశిక్ రెడ్డి అన్నారు.

Tags:    
Advertisement

Similar News