హిండెన్ బర్గ్ పై ఈడీ రైడ్స్.. కేటీఆర్ ఫన్నీ కామెంట్స్

వాట్ ఎ సర్ ప్రైజ్ అంటూ ట్వీట్ మొదలు పెట్టిన కేటీఆర్.. ఐటీ, సీబీఐ, ఈడీ.. బీజేపీ చేతిలో తోలుబొమ్మల్లా మారిపోయాయని ఎద్దేవా చేశారు.

Advertisement
Update:2023-02-14 17:14 IST

వాట్ నెక్ట్స్.. హిండెన్ బర్గ్ మీద ఐటీ దాడులా, లేక ఆ సంస్థను టేకోవర్ చేసే ప్రయత్నమా..? అంటూ ట్విట్టర్లో ఫన్నీ కామెంట్స్ పెట్టారు మంత్రి కేటీఆర్. బీబీసీపై జరిగిన ఐటీ దాడులపై ఆయన స్పందించారు. వాట్ ఎ సర్ ప్రైజ్ అంటూ ట్వీట్ మొదలు పెట్టిన కేటీఆర్.. ఐటీ, సీబీఐ, ఈడీ బీజేపీ చేతిలో తోలుబొమ్మల్లా మారిపోయాయని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే బీబీసీ ఇండియాపై ఐటీ దాడులు జరిగాయని పేర్కొన్నారు కేటీఆర్.


గతంలో కూడా ఐటీ, ఈడీ, సీబీఐపై కేటీఆర్ భలే పంచ్ వేశారు. మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సమయంలో ఆయన వేసిన ట్వీట్ అప్పట్లో వైరల్ గా మారింది. బీజేపీ పేరు ఇక BJP కాదని దాన్ని కచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. "BJ...EC-CBI-NIA-IT-ED...P" గా బీజేపీ పేరు మార్చాలంటూ సెటైర్లు వేశారు. BJP మధ్యలో EC-CBI-NIA-IT-ED ఇవన్నీ ఉన్నాయని అన్నారు.


దర్యాప్తు సంస్థలను తమ జేబు సంస్థలుగా బీజేపీ మార్చేసుకుందనే వాదన చాన్నాళ్లుగా వినపడుతోంది. ఇప్పుడు బీబీసీ విషయంలో అది మరోసారి రుజువైంది. మోదీకి వ్యతిరేకంగా ఎక్కడ గొంతు లేస్తే అక్కడికి ఈటీ, ఐడీ వెళ్లి వాలిపోతున్నాయి. స్వామి భక్తి చూపించుకుంటున్నాయి. ప్రభుత్వం కూడా ఇలాంటి దాడుల్ని విపరీతంగా ప్రోత్సహిస్తోంది. తమ కక్షసాధింపు చర్యలకోసం ఆయా సంస్థలను వాడుకుంటోంది. ప్రజాస్వామ్యానికి కలంకం తెచ్చేలా ఓ దుస్సంప్రదాయాన్ని పెంచి పోషిస్తోంది. బీబీసీ సంస్థలో జరిగిన దాడుల్ని కేవలం సర్వేలంటూ సరిపెట్టిన అధికారులు.. ఉద్యోగుల ఫోన్లు తీసేసుకోవడం, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకోవడం కూడా సంచలనంగా మారింది. ఇదే ఊపులో మోదీకి అవకాశం ఉంటే హిండెన్ బర్గ్ పై కూడా ఈడీ రైడ్స్ చేయిస్తాడేమో అంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. మోదీకి అవకాశం లేక ఈడీని పంపలేదు, అదానీకి ఛాన్స్ లేక ఆ సంస్థను టేకోవర్ చేయలేదు. అదీ సంగతి.

Tags:    
Advertisement

Similar News