రేవంత్‌ పాలన బాగానే ఉంది.. గుత్తా మాటల్లోని ఆంతర్యమేమి..?

అమిత్ పేరును నల్గొండ అభ్యర్థిగా రెండు నెలల ముందే పార్టీ ప్రకటించి ఉంటే బాగుండేదన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి బంధువే అయినప్పటికీ.. తనను అసెంబ్లీ సమావేశాల్లో మినహా మరోచోట కలవలేదన్నారు సుఖేందర్ రెడ్డి.

Advertisement
Update:2024-03-15 13:42 IST

సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందన్నారు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మీడియాతో చిట్‌చాట్‌ చేసిన ఆయన.. కాంగ్రెస్‌లో చేరాలని ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమేనన్నారు. కానీ, ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.

నల్గొండ పార్లమెంట్ పరిధిలో కొందరు నేతలు సహకరించకపోవడంతోనే త‌న కుమారుడు అమిత్ రెడ్డి BRS టికెట్‌పై పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నాడని సుఖేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఏ పార్టీకి సంబంధం లేని రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్నానని.. తాను ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు.

అమిత్ పేరును నల్గొండ అభ్యర్థిగా రెండు నెలల ముందే పార్టీ ప్రకటించి ఉంటే బాగుండేదన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి బంధువే అయినప్పటికీ.. తనను అసెంబ్లీ సమావేశాల్లో మినహా మరోచోట కలవలేదన్నారు సుఖేందర్ రెడ్డి.

నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి BRS నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని పోటీ చేయించాలని భావించారు. అయితే చివరి నిమిషంలో పోటీ చేయబోనని అమిత్‌ ప్రకటించారు. ఇక ఇటీవల తన తనయుడితో కలిసి గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారన్న వార్తలు వచ్చాయి. దీంతో వారు పార్టీ మారుతారన్న ప్రచారం జోరందుకుంది. గుత్తా అమిత్‌కు కాంగ్రెస్‌ భువనగిరి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News