కాంగ్రెస్‌పై దీదీ సెటైర్లు.. కరెక్ట్‌ అంటూ కేటీఆర్ ట్వీట్

దీదీ వ్యాఖ్యలపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్‌ వైఖరి ఇండియా కూటమి చీలికకు ఎలా దారి తీసిందో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

Advertisement
Update:2024-02-03 15:20 IST
కాంగ్రెస్‌పై దీదీ సెటైర్లు.. కరెక్ట్‌ అంటూ కేటీఆర్ ట్వీట్
  • whatsapp icon

ఇండియా కూటమిలోని లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ యాత్ర బెంగాల్‌కు వచ్చిందన్న మమతా.. యూపీలోని వారణాసి, అలహాబాద్‌ మీదుగా ఎందుకు వెళ్లదని ప్రశ్నించారు.

దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్‌ బీజేపీతో నేరుగా పోరాడాలని సవాల్ విసిరారు. రాహుల్‌ సొంత సీటు అమేథిని కోల్పోయారని ఎద్దేవా చేశారు మమత. బెంగాల్‌లోని ముస్లింల మధ్య చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్‌, సీపీఎం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ 300 సీట్లలో పోటీ చేస్తే కనీసం 40 స్థానాల్లోనైనా గెలుస్తుందా..? అంటూ సెటైర్లు వేశారు మమత. యాత్ర బెంగాల్‌లో అడుగుపెడుతున్న టైమ్‌లో కనీసం తనకు మర్యాదపూర్వకంగా కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. ఇలా ప్రవర్తిస్తే ఇండియా కూటమి ఎక్కడ ఉంటుందన్నారు.


ఇక దీదీ వ్యాఖ్యలపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్‌ వైఖరి ఇండియా కూటమి చీలికకు ఎలా దారి తీసిందో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. యూపీ, గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లో బీజేపీని నేరుగా ఎదుర్కోడానికి బదులుగా.. కాంగ్రెస్‌ ఇతర పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతోందన్నారు. కేసీఆర్‌, మమత, కేజ్రీవాల్‌, స్టాలిన్ లాంటి బలమైన నాయకుల నేతృత్వంలోని శక్తులే బీజేపీని నిలువరించగలవనేది వాస్తవమంటూ ట్వీట్ చేశారు. బీజేపీకి కాంగ్రెస్‌ సరైన ప్రత్యామ్నాయం కాదన్నారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News