మిడ్‌మానేరు నిర్వసితుల సమస్యలు పరిష్కరిస్తాం : సీఎం రేవంత్

అభివృద్ధి జరగాలంటే.. ఎవరో ఒకరూ భూమిని కోల్పోవాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వేములవాడ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Advertisement
Update:2024-11-20 16:03 IST

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వేములవాడ రాజన్ననూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని ఆనాడే చెప్పానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ విజయోత్సవ సభలో మాట్లాడారు. మిడ్‌మానేరు నిర్వసితుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాకు ఇన్ చార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన నవంబర్ 30లోపు మరోసారి వస్తారని.. ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. భారతదేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్‌. పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ ఇక్కడి నుంచే ప్రకటన చేశారు.

తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో కరీంనగర్‌ బిడ్డ, జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే.. ఎంత త్యాగానికైనా సిద్ధమవుతున్న సంగతి తెలంగాణ రాష్ట్రమే ఉదాహరణగా తీసుకొచ్చారు. బండి సంజయ్ ని రెండు సార్లు ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు ఏమి ఇచ్చారు. పార్లమెంట్ లో కరీంనగర్ గురించి ఎప్పుడైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిపై ముఖ్యమంత్రి స్పందించారు. కలెక్టర్‌పై అధికారులపై కుట్రపూరితంగా దాడి చేసిన వారిపై కేసులు పెడుతుంటే బీఆర్‌ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌ని అసెంబ్లీ రావాలని ముఖ్యమంత్రి కోరారు.

Tags:    
Advertisement

Similar News