మునుగోడు ఉపఎన్నికలో బీజేపీని ఓడిస్తాం.. సీపీఐ నారాయణ

మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించేది తామే అని సీపీఐ నేత నారాయణ అన్నారు. బీజేపీ ని ఓడించడం కోసం ఎవరికి మద్దతివ్వాలో రేపు చెప్తామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Update:2022-08-19 17:23 IST

మునుగోడు ఉపఎన్నిక లో గెలుపు కోసం ప్రధాన పార్టీలైన టీఆరెస్, కాంగ్రెస్, బీజేపీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుండగా.. సీపీఐ కూడా రంగంలోకి దిగింది. ఈ నియోజకవర్గంలో తమకు బలం ఉందని, ఇక్కడ జరిగే ఎన్నికలో గెలుపు..ఓటములను తామే డిసైడ్ చేస్తామని ఈ పార్టీ నేత నారాయణ ప్రకటించారు. తమ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని, టీఆరెస్, కాంగ్రెస్ పార్టీలు తమను సంప్రదిస్తున్నాయని ఆయన శుక్రవారం తెలిపారు. పార్టీలో అందరి అభిప్రాయాల ప్రకారం తమ నిర్ణయం ఉంటుందన్నారు. రేపు మధ్యాహ్నం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఈ ఎన్నికలో బీజేపీని ఓడిస్తామని, అదే తమ ధ్యేయమన్నారు. మునుగోడులో రేపు సీఎం కేసీఆర్, ఈ నెల 21 న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్న నేపథ్యంలో నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరి ఈ ఎన్నికలో సీపీఐ ... టీఆరెస్ లేదా కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తుందా లేక ఒంటరిగానే పోటీ చేస్తుందా అన్న విషయం రేపు తేలిపోయే అవకాశాలున్నాయి.





Tags:    
Advertisement

Similar News