కులగణన జరగకుండా స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్ళాం : మహేశ్‌కుమార్

We went to local body elections without caste census: Mahesh Kumar

Advertisement
Update:2024-09-25 20:04 IST

మరో నాలుగైదు రోజుల్లో బీసీ కులగణన గెడ్‌లైన్స్ విడుదల చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన బీసీల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గోన్నారు. బీసీల కులగణన అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని ఖచ్చితంగా కులగణన చేస్తామని ఆయన తెలిపారు. దేశ చరిత్రలో బీసీల కులగణన గురించి డేర్‌గా మాట్లాడింది రాహుల్ గాంధీ మాత్రమేని ఈ విషయంలో రాహుల్ చాలా గ్రేట్ అని అన్నారు. బీసీలకు రావాల్సిన వాటా, వారికి దక్కాల్సిన ఫలాలు ఎక్కడా రాజీ లేదని పీసీసీ ప్రెసిండెట్ అన్నారు. కులగణన ప్రక్రియ త్వరలో ముందుకు వెళ్తుంతాదన్నారు.

చలో అసెంబ్లీకి పిలుపునిస్తామని బీసీ నాయకులు చెబితే వారితో తాను మాట్లాడానని, కులగణన అల్రెడీ ప్రాసెస్‌లో ఉందని, డిస్ట్రబ్ చేయొద్దని సూచించానని తెలిపారు. అనుమానం ఉంటే ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని తానే స్వయంగా వచ్చి ప్రభుత్వ ఆలోచనను మీ ముందుపెడతానని చెప్పానని మహేశ్‌కుమార్ అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌లకు బీసీల పట్లా ఎటుంటి చిత్తశుద్ది లేదన్నారు. కులగణన జరగకుండా రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలు జరగవని ఆయన స్ఫష్టం చేశారు.

సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు కలిశారు. బీసీ కులగణన ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం వారికి సూచించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వెంటనే కులగణన కార్యచరణ ప్రారంభించి వేగంగా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ సభ్యులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు

Tags:    
Advertisement

Similar News