విద్యుత్‌ ఛార్జీలను పెంచే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం

ఛార్జీల పెంపు నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నదని కేటీఆర్‌ ఫైర్‌

Advertisement
Update:2024-10-25 12:21 IST

విద్యుత్‌ ఛార్జీలను ఐదు రెట్లు పెంచే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని, అన్నిరకాల పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్‌ను ఒకే గాటాన కట్టడం సరికాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో సహకార విద్యుత్‌ సరఫరా సంఘం (సెస్‌) ఛార్జీల పెంపుపై బహిరంగ విచారణ చేపట్టింది. ఈ బహిరంగ విచారణ, ప్రజాభిప్రాయ సేకరణలో కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ పేరుతో ఉన్న విద్యుత్‌ను ఊగగొట్టే ప్రయత్నం చేస్తున్నది. ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామన్న సాకుతో రూ. 18,500 కోట్ల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజలపై అదనపు భారాన్ని మోపే ప్రయత్నం చేస్తున్నది. చాలా అసంబద్ధమై, అశాస్త్రీయమైన ప్రతిపాదనలను ప్రభుత్వం ఇవాళ ముందుకు తెచ్చి పేద, మధ్య తరగతి ప్రజానీకం నడ్డి విరుస్తున్నదని మేము భావిస్తున్నాం. అందుకే ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని విద్యుత్‌ నియంత్రణ మండలి కి విజ్ఞప్తి చేశామన్నారు. ముఖ్యంగా 300 యూనిట్ల వరకు ఉన్న ఫిక్స్‌ డ్‌ ఛార్జి రూ. 10 ఉంటే దాన్ని ఐదు రెట్లు పెంచి పది రూపాయలు ఉన్నదాన్ని రూ. 50 రూపాయలు చేస్తున్నామంటే ఇంతకంటే తలతిక్క నిర్ణయం మరొకటి ఉండదని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎండకాలంలో ప్రతి ఇంట్లో 300 యూనిట్లు దాటుతుంది. కనుక ఐదు రెట్లు పెంచడం అంటే దాని వల్ల బిల్లు ఎంత పెరుగుతుందో? ఛార్జీల మోత ఎంత మోగుతుందో రాష్ట్రంలోని ప్రజలంతా ఆలోచించాలని కేటీఆర్‌ కోరారు.

కేసీఆర్‌ పాలనలో విద్యుత్‌ సంస్కరణలక స్వర్ణయగం అన్నారు. ప్రజలపై భారం వేసి సంపద పెంచుకోవాలని ఈ ప్రభుత్వం చూస్తున్నది ప్రజలపై రూ. 18 వేల కోట్ల భారం మోపాలని చూస్తున్నారని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి నడ్డి విరిచేలా విద్యుత్‌ ఛార్జీలు పెంచుతున్నారు. అందరినీ ఒకే క్యాటగిరీలోకి తేవడం దురదృష్టకరమన్నారు. కేంద్రం ఒత్తిడి తెచ్చినా సాగు మోటార్లకు తాము మీటర్లు పెట్టలేదని ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తు చేశారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచి సామాన్యులపై భారం వేయవద్దని కోరారు. డిస్కంలతో పోలిస్తే సిరిసిల్ల సెస్‌ పని తీరు బాగుందన్న కేటీఆర్‌ 5 నుంచి 7.5 హెచ్‌పీ లోడ్‌ వరకు రైతులకు రాయితీ ఇవ్వాలన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్లు బంద్‌ అయ్యాయని, నేతన్నలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. 

Tags:    
Advertisement

Similar News