తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేశాం..సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

మహారాష్ట్రలో బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Advertisement
Update:2024-11-09 14:02 IST

తెలంగాణలో ఎన్నికల హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేశామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీచే సెప్టెంబర్ 17 2023 లో మేమిచ్చిన హామీలను తెలంగాణలో అమలు చేశామని రేవంత్ అన్నారు. మహారాష్ట్రలో ప్రధాని మోదీ తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే..మేం నిజాలు చెబుతూనే ఉంటాం..అందుకే నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చా న్నారు.

దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయి. నల్లచట్టాలు తెచ్చి అదానీ,అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం. తెలంగాణలో 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టామని సీఎం తెలిపారు

Tags:    
Advertisement

Similar News