కేంద్రం ఇవ్వకున్నా సొంత నిధులతో పథకాల అమలు-కేటీఆర్

కేంద్రం నిధులు ఇవ్వకున్నా స్వంత నిధులతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మహిళలకు సామాజిక భద్రతతో బాటు గౌరవం తెచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు.

Advertisement
Update:2022-08-11 19:21 IST

అంగన్ వాడీ, ఆశావర్కర్లను ఆదుకుంటున్నామని, కేంద్రం నిధులు ఇవ్వకున్నా సొంత నిధులతో వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలంగాణ మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహిళలకు సామాజిక భద్రతతో బాటు గౌరవం తెచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. రక్షాబంధన్ సందర్భంగా మహిళా లబ్ధిదారులతో ఇంటరాక్ట్ అయిన ఆయన.. కేసీఆర్ హయాంలో పెన్షన్ 10 రెట్లు పెరిగిందని, ఎవరూ అడగకున్నా పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. 200 రూపాయల పెన్షన్ ని 2 వేల రూపాయలకు పెంచామని, 4 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛను అందజేస్తున్నామని చెప్పారు. ఈ నెల 15 నుంచి 57 ఏళ్ళు నిండిన అర్హులకు కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. (ఇటీవల సీఎం కేసీఆర్.. తెలంగాణాలో 57 ఏళ్ళు పైబడిన సుమారు 10 లక్షలమందికి పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు).

ఇక మహిళల భద్రతకు షీ టీమ్స్ ను తెచ్చామని . వారికి రాజకీయ అవకాశం కల్పించాలన్నది ప్రభుత్వ ధ్యేయమని కేటీఆర్ అన్నారు. .. వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాదు.. మహిళా బిల్లు తేవాలని తీర్మానించి కేంద్రానికి కూడా పంపాం అని ఆయన తెలిపారు. 'అమ్మఒడి', కేసీఆర్ కిట్ సహా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళలకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఏ రాష్ట్రంలో చేయని అభివృద్ధిని తెలంగాణాలో చేస్తున్నామని, బాలికల గురుకులాలు, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన ఆయన.. 4 లక్షలకు పైగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తున్నట్టు తెలిపారు. మన ఊరు-మన బడి పేరిట 7,300 కోట్ల వ్యయంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.






Tags:    
Advertisement

Similar News