తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నీళ్ల పంచాయితీ

తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ షూరు అయింది.

Advertisement
Update:2025-01-15 12:07 IST

తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల యుద్దం మళ్లీ మొదలైంది. కృష్ణా జలాల వివాదంపై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిసమీక్ష నిర్వహించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగొద్దని మంత్రి ఉత్తమ్ అన్నారు. ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం ఎక్కువని, మెజారిటీ వాటా రాష్ట్రానికి దక్కాలని అభిప్రాయపడ్డారు.

దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కృష్ణా రివర్ బోర్డు ఇప్పటికే చర్చించింది. అయితే ఏపీ, తెలంగాణప్రభుత్వాలు భిన్న వాదనలు వినిపించడంతో ఈ పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్న ప్రతిపాదననను తాము అంగీకరించడలేదని మంత్రి తెలిపారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా తీవ్రంగా ప్రయత్నం చేయాలన్నారు. నీళ్లలో మెజార్టీ వాటా దక్కాలని ఉన్నతాధికారులు, న్యాయవాదులకు ఉత్తమ్ సూచించారు.

Tags:    
Advertisement

Similar News