సాయిచంద్ భార్యకు గిడ్డంగుల శాఖ చైర్ పర్సన్ పదవి

సాయిచంద్ కుటుంబానికి ఆర్థిక సాయంతోపాటు, ఆయన భార్య రజినిని రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్ పర్సన్ గా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
Update:2023-07-07 18:31 IST

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఇటీవల అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఆర్థిక సాయంతోపాటు, రాజకీయంగా కూడా ఆ కుటుంబానికి అండదండగా నిలిచారు సీఎం కేసీఆర్. సాయిచంద్ అకాల మరణంతో ఆయన భార్య రజినికి గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

కోటిన్నర రూపాయల ఆర్థిక సాయం..

ఇటీవల అకాల మరణం చెందిన బీఆర్ఎస్ నేతలు జగదీష్, సాయిచంద్ కుటుంబాలకు పార్టీ అండగా నిలబడింది. సాయిచంద్ కుటుంబానికి కోటిన్నర రూపాయలు, జగదీష్ కుటుంబానికి కోటిన్నర రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. సాయిచంద్ తండ్రికి చెల్లెలికి చెరి 25 లక్షల రూపాయలు కూడా అందిస్తామని అన్నారు మంత్రి కేటీఆర్.

సాయిచంద్ కుటుంబానికి ఆర్థిక సాయంతోపాటు, ఆయన భార్య రజినిని రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్ పర్సన్ గా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సాయిచంద్ మరణం తర్వాత నివాళులర్పించడానికి సీఎం కేసీఆర్, కేటీఆర్ వారి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో సాయిచంద్ భార్య రజిని ఆవేదన అక్కడున్నవారందరినీ కలచి వేసింది. పార్టీకోసం పాటుపడిన వారి కుటుంబాలను తామెప్పుడూ మరచిపోబోమని అంటున్నారు మంత్రి కేటీఆర్. ప్రతి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News