ఐటీ సోదాలపై వివేక్ రియాక్షన్..

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి తన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారని ఆరోపించారు వివేక్ వెంకట స్వామి. సోమాజీగూడలోని వివేక్ నివాసంలో ఉదయమే ఐటీ సోదాలు ముగిశాయి. మొత్తం నాలుగున్నర గంటలపాటు సోదాలు జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement
Update:2023-11-21 19:56 IST

ఎన్నికల వేళ ఐటీ అధికారులు చేపట్టిన సోదాలపై కాంగ్రెస్ పార్టీ చెన్నూరు అభ్యర్థి వివేక్ వెంకట స్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవలేకే తనపై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారాయన. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌ ఫిర్యాదు చేయడం వల్లే ఐటీ దాడులు జరిగాయని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ ఎన్నికల్లో చెన్నూర్ సహా కాంగ్రెస్‌ పార్టీ 80 సీట్లు గెలవబోతోందని చెప్పారు వివేక్.

కోడ్ ఉల్లంఘించారు..

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి తన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారని ఆరోపించారు వివేక్ వెంకట స్వామి. సోమాజీగూడలోని వివేక్ నివాసంలో ఉదయమే ఐటీ సోదాలు ముగిశాయి. మొత్తం నాలుగున్నర గంటలపాటు సోదాలు జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవలే విశాఖ ఇండస్ట్రీస్‌ కంపెనీ ఖాతాలనుంచి పెద్ద మొత్తంలో బదిలీ అయిన నగదు వ్యవహారంపై కూడా వివేక్ ని ఐటీ అధికారులు ప్రశ్నించారని అంటున్నారు. అటు మంచిర్యాలలోని వివేక్‌ ఇంట్లో ఉదయం ప్రారంభమైన ఐటీ సోదాలు 10 గంటలకుపైగా కొనసాగాయి. సాయంత్రం అధికారులు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారు.

వివేక్ సోదరుడు వినోద్ ఇంటిలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ దాడులు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ అభ్యర్థుల్నే టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు వివేక్ ఇంటి వద్ద బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈరోజు వివేక్ ప్రచారానికి ఎక్కడికీ వెళ్లలేదు. ఐటీ సోదాల వల్ల ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. 

Tags:    
Advertisement

Similar News