ఈటలకు 10 కోట్లు, రాజగోపాల్‌కి 25 కోట్లు.. బీజేపీ కొనుగోళ్లకు దళారీ వివేక్

ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే ముందు ఆయన కొడుకు అధీనంలో ఉన్న సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ సంస్థకు వివేక్ కంపెనీ నుంచి 25 కోట్ల రూపాయలు అప్పుగా మళ్లించారు.

Advertisement
Update:2022-10-10 15:03 IST

బీజేపీలో చేరేందుకు ఈటల రాజేందర్‌కి ఇచ్చిన అడ్వాన్స్ రూ.10 కోట్లు

కాంగ్రెస్ కి ద్రోహం చేసేందుకు రాజగోపాల్ రెడ్డికి ముట్టిన బయానా రూ.25 కోట్లు

ఇవి ఆరోపణలు కాదు, అక్షర సత్యాలు. ఈ రెండు డీల్స్ లో దళారీగా వ్యవహరించిన బీజేపీ నేత జి.వివేక్ కి చెందిన విశాఖ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ బయటపెట్టిన వివరాలు.

2021 జూన్‌లో ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోయే ముందుగా వివేక్ కంపెనీ నుంచి ఆయనకు 10 కోట్ల రూపాయల అడ్వాన్స్ వెళ్లింది. అప్పుగా ఈ సొమ్ముని జమున హేచరీస్ కంపెనీకి చెల్లించినట్టు విశాఖ గ్రూప్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లో ఎంట్రీ ఉంది. ఇక ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే ముందు ఆయన కొడుకు అధీనంలో ఉన్న సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ సంస్థకు వివేక్ కంపెనీ నుంచి 25 కోట్ల రూపాయలు అప్పుగా మళ్లించారు.

సుశీ ఇన్ ఫ్రా కంపెనీకి 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్క్ లు దక్కడానికి ముందే ఇది జరిగింది. అంటే ఈ పాతిక కోట్లు అడ్వాన్స్ అన్నమాట. ఆ సొమ్ము కూడా వివేక్ కంపెనీ నుంచి మళ్లించారు. అంటే తెలంగాణలో బీజేపీ కొనుగోలు చేస్తున్న నాయకులందరి విషయంలో పార్టీకి వివేక్ దళారీగా వ్యవహహిస్తున్నారని తేలిపోయింది.

ఇంతమందికి ఇన్ని కోట్లు ఇస్తున్నారంటే అసలు బీజేపీ నుంచి వివేక్ ఎంత వెనకేసుకుని ఉంటారో అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇటీవల రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లో ఈటలకు, వివేక్‌కి కూడా వాటాలు ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. అంటే.. ఇలా కాంట్రాక్ట్ ల పేరుతో దోచుకోవడం, ఆ డబ్బుతో బీజేపీకి నాయకుల్ని కొనుగోలు చేయడం ఇదే తెలంగాణలో జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది అని ఇన్నాళ్లూ డబ్బా కొట్టుకున్నారు. కానీ తెలంగాణలో బీజేపీ కొనుగోళ్లు మొదలు పెట్టింది అనేదే అసలు నిజం. బీజేపీలో ఉన్నది అమ్ముడుపోయిన నాయకులు మాత్రమే, అసలైన నాయకులు కాదు. అంటే బీజేపీది బలం కాదు, కేవలం వాపు మాత్రమే. విశాఖ గ్రూప్ లెక్కల గురించి, బయటపడిన వాస్తవాల గురించి బీజేపీ నాయకులు సౌండ్ చేయడం లేదు. ఇప్పటికే రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ గురించి రాజగోపాల్ రెడ్డి టీవీ డిబేట్‌లో నోరుజారి సగం కొంప ముంచారు. ఇప్పుడు ఈ లెక్కలన్నీ బయటపడటంతో మునుగోడులో పూర్తిగా బీజేపీ కొంప మునిగిపోతోంది.

Tags:    
Advertisement

Similar News