బండిని పదవి నుంచి తొలగించి పరువు పోగొట్టుకున్నారు..

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత విజయశాంతి హైదరాబాద్ గాంధీ భవన్‌లో మీడియా స‌మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement
Update:2023-11-18 14:28 IST

బండిని పదవి నుంచి తొలగించి పరువు పోగొట్టుకున్నారు..

బండి సంజయ్‌ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో ఆ పార్టీ పరువు పోయిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు. బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి.. నిన్న హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒక్కరోజు వ్యవధిలోనే విజయశాంతికి ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ కమిటీకి చీఫ్‌ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. విజయశాంతిని చీఫ్ కోఆర్డినేటర్‌గా నియమిస్తూ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత విజయశాంతి హైదరాబాద్ గాంధీ భవన్‌లో మీడియా స‌మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ హామీ ఇవ్వడంతోనే ఆ పార్టీలోకి వెళ్లినట్లు విజయశాంతి చెప్పారు. అయితే ఏళ్లు గడిచినప్పటికీ కేసీఆర్‌పై బీజేపీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆధారాలు ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈ సంద‌ర్భంగా బీజేపీని ప్రశ్నించారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని అందుకే కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ఆ రెండు పార్టీలు తెరపై విమర్శలు చేసుకుంటూ తెర వెనుక ఒప్పందాలు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తొలగించవద్దని పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు విజయశాంతి తెలిపారు. అయినా ఆయన్ను తొలగించడంతో బీజేపీ పరువు పోయిందని ఆమె వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News