విమర్శకులకు రాములమ్మ స్ట్రాంగ్ కౌంటర్‌..!

కేంద్ర పెద్దలతో తమకు హామీ ఇప్పించి మరీ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ఈ మాట నిజమో.. కాదో చెప్పాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.

Advertisement
Update:2023-11-19 22:08 IST

తాను పార్టీ మారడంపై వస్తున్న విమర్శలపై స్పందించారు సీనియర్ లీడర్ విజయశాంతి. ఈ మేరకు సోషల్ మీడియాలో తనను విమర్శిస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు. రాములమ్మ పార్టీ మారారు అని విమర్శించే వాళ్లు ఒక్కటి తెలుసుకోవాలంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు జెండా మోసి కొట్లాడానని చెప్పుకొచ్చారు విజయశాంతి.

కాంగ్రెస్‌లో ఉన్న టైమ్‌లో బండి సంజయ్‌, కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు పదేపదే తన దగ్గరకు వచ్చి బీఆర్ఎస్‌ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. అందరూ సమర్థిస్తే బీజేపీ ఎంతవరకైనా కొట్లాడుతుందంటూ చెప్పారని గుర్తుచేసుకున్నారు విజయశాంతి. ఇవే మాటలు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిలకు చెప్పారన్నారు. కేంద్ర పెద్దలతో తమకు హామీ ఇప్పించి మరీ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ఈ మాట నిజమో.. కాదో చెప్పాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.


రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోవాలి.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలన్న ఒకే ఒక్క కారణంతో కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి వెళ్లానన్నారు. కానీ, మాట నిలబెట్టుకోలేక బీజేపీ మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్‌తో బీజేపీ అవగాహన కుదుర్చుకుందని.. ఈ విషయం తెలిసే నాయకులంతా రాజీనామాలు చేసి పార్టీని వీడుతున్నారన్నారు విజయశాంతి. విమర్శ తేలిక అని ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ తన విమర్శకులకు సూచించారు.

Tags:    
Advertisement

Similar News