అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెంకట్ రెడ్డి

కా‍ంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిల్చింది. ఆయనను బుజ్జగించడానికే ఢిల్లీకి పిల్చినట్టు తెలుస్తోంది. ప్రియాంకా గాంధీ స్వయంగా వెంకట రెడ్డితో సమావేశం కానున్నారని సమాచారం.

Advertisement
Update:2022-08-24 12:11 IST

కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి వ్యవహారం తేల్చడానికి పార్టీ అధిష్టానం ఆయనను ఢిల్లీకి పిలిపించింది.ఈ రోజు ప్రియాంకా గాంధీ ఆయనతో సమావేశమయ్యే అవకాశం ఉంది. మూడురోజుల క్రితం జరిగిన ప్రియాంకా గా‍ంధీతో తెలంగాణ నేతల సమావేశానికి వెంకటరెడ్డి డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. రేవంత్ తో పాటు తాను కూర్చునే ప్రసక్తే లేదని అని ఆయన తెగేసి చెప్పారు.

ఈ నేపథ్యంలో రేవంత్ లేకుండానే వెంకట రెడ్డితో భేటీ అవ్వాలని అధిష్టానం నిర్ణయించుకుంది. ఇప్పటికే ఢిల్లీలో భట్టి విక్రమార్క్‌, శ్రీధర్‌బాబు ఉన్నారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మాత్రం నిన్న రాత్రే హైదరాబాద్‌కు వచ్చేశారు. దీంతో వీళ్లిద్దరి సమక్షంలోనే ప్రియాంక లేదంటే ముఖ్యనేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని బుజ్జగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరో వైపు గత కొంతకాలంగా వెంకట్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, తననూ విమర్శిస్తున్నారని, అది పార్టీకి చేటు చేస్తుందనికాబట్టి ఆయనను పార్టీ నుంచి సాగనంపాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ చేసిన సూచనను ప్రియాంక గాంధీతో సహా ముఖ్యనేతలంతా వ్యతిరేకించినట్టు తెలిసింది.

Tags:    
Advertisement

Similar News