సెక్రటేరియట్‌లో వాస్తు మార్పులు..మరో గేటు ఓపెన్

వాస్తులో భాగంగా తెలంగాణ సెక్రటేరియట్ గ్రిల్స్ తొలగించి మరో గేటు ఓపెన్ చేయడానికి ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు.

Advertisement
Update:2024-11-18 10:26 IST

తెలంగాణ సెక్రటేరియట్‌కి స్వల్ప వాస్తు మార్పులు జరుగుతున్నాయి. సచివాలయానికి తూర్పు వైపున ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసివేస్తున్నారు. మార్పులో భాగంగా ప్రస్తుత ప్రధాన ద్వారం తలుపులు తీసేసి ఆ ప్రాంతంలో రేకులు ఉంచారు. ఈశాన్య గేటుకు తూర్పు వైపున ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ప్రధాన ద్వారం ఉన్న చోట మరో గేటును ఏర్పాటు చేస్తారు. సచివాలయంలోని మిగిలిన గేట్లను యథావిధిగా ఉంచనున్నారు.

వచ్చే నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఆ లోపలే సచివాలయ వాస్తు మార్పులు పూర్తి చేసే పనుల్లో అధికారులు ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ వాస్తుకు ప్రాధాన్యత ఇచ్చేవారు. దీనిపైన రేవంత్ రెడ్డి అప్పట్లో కోర్టుకు కూడా వెళ్లారు. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే సచివాలయంలో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండ్పై గులాబీ పార్టీ గళమెత్తుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాయ్ గాయ్ చేసిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక వాస్తు పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News