తాపీమేస్త్రీకి 5డేస్ వీక్, ఏడాదికి 4.5 లక్షల జీతం ప్లస్ అలవెన్సు.. ఎక్కడంటే?
అమెరికన్ కాన్సులేట్‌లో మేసన్ (మేస్త్రీ) ఉద్యోగం కోసం ఈ ప్యాకేజీతో ప్రకటన వేశారు. వారానికి 40 గంటలు (అంటే 5డేస్ వీక్) పనికి ఏడాదికి 4.5 లక్షల జీతం, ఇతర భత్యాలు కూడా ఇస్తామన్నారు.
వారానికి 40 గంటల పని, ఏడాదికి 4.5 లక్షల జీతం పైగా ఇతర భత్యాలు.. చూస్తుంటే ఇవేవో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం స్టార్టింగ్ ప్యాకేజ్ అనుకుంటున్నారా..? కానే కాదు.. ఇది తాపీమేస్త్రీకి ఇస్తామంటున్న ప్యాకేజీ. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం తాపీమేస్త్రీ కావాలంటూ ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చింది.
పర్మినెంట్ ఉద్యోగం
అమెరికన్ కాన్సులేట్‌లో మేసన్ (మేస్త్రీ) ఉద్యోగం కోసం ఈ ప్యాకేజీతో ప్రకటన వేశారు. వారానికి 40 గంటలు (అంటే 5డేస్ వీక్) పనికి ఏడాదికి 4.5 లక్షల జీతం, ఇతర భత్యాలు కూడా ఇస్తామన్నారు. అంతేకాదు పండగలు, ఇతర సెలవుదినాల్లోనూ సెలవే. పైగా పర్మినెంట్ ఉద్యోగమట. ఎలక్ట్రానిక్ పద్దతిలో అప్లయ్ చేసుకోవాలి. చివరి తేదీ ఫిబ్రవరి 25.
రెండేళ్ల అనుభవం
తాపీ మేస్త్రీగా రెండేళ్ల అనుభవం ఉండాలి. ఇటుకలు, సిమెంట్ బ్రిక్స్, రాళ్లు వంటి వాటితో గోడలు, నిర్మాణాలు చేయగలగాలి. 8వ తరగతి పాసై ఉండాలి. గ్రేడ్-1 ఇంగ్లీష్ పరిజ్ఞానం (సాధారణమైన తేలిక పదాలు అర్థం చేసుకునే జ్ఞానం) ఉండాలి. ఒక్కటే పోస్టు ఉన్నప్పటికీ ఈ జీతభత్యాలు, పనిగంటలు చూసి ఈ ప్రకటనను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.