ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నియామక ఫలితాలు విడుదల
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నియామక ఫలితాలు విడుదలయ్యాయి.
Advertisement
రాష్ట్రంలో ఫుడ్ సేప్టీ ఆఫీసర్ నియామక రాత పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ tspsc.gov.inలో ఉన్నాయని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఐపీఎం పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలు, ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో 24 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 జులై 21న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 7, 8 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి.. ఇవాళ తుది ఫలితాలను ప్రకటించారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షకు 16,381 మంది దరఖాస్తు చేసుకోగా, 14,830 మంది హాల్టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇందులో 9,535 మంది పరీక్షకు హాజరయ్యారు.
Advertisement