డబుల్‌ బెడ్రూం కాలనీల్లో మౌలిక సదుపాయాలకు రూ.196 కోట్లు

అన్ని సౌకర్యాలు కల్పించేందుకు మంజూరు చేసిన ప్రభుత్వం

Advertisement
Update:2024-11-26 20:50 IST

రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్రూం కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.196.46 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారు ప్రాంతాలో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం కాలనీల్లో అవసరమైన తాగునీరు, కరెంట్‌ సరఫరా, మురుగునీటి వ్యవస్థను మెరుగు పరచడం సహా పలు ఇతర సదుపాయాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయినా అనేక పనులు పెండింగ్‌ లో ఉండటంతో వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఔటర్‌ రింగ్‌ సమీప ప్రాంతాల్లో ఉన్న డబుల్‌ బెడ్రూం ఇండ్ల కాలనీలతో పాటు ఇతర ప్రాంతాల్లోని డబుల్‌ బెడ్రూం కాలనీల్లో అన్ని సదుపాయాలు కల్పించి వాటిని ప్రజలకు పంపిణీ చేయనున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సొంత జాగాలు ఉన్నవారికి ఇండ్లు మంజూరు చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. అదే సమయంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన డబుల్‌ బెడ్రూంలను పేదలకు పంపిణీ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది.




 


Tags:    
Advertisement

Similar News