త్వరలో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు

మెట్రో రైలు మొదటి దశ నిర్మాణం సమయంలో తన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని, నాడు అలా చేసిన వాళ్లే నేడు పూలదండలతో సత్కరిస్తున్నారని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు

Advertisement
Update:2024-11-26 16:07 IST

త్వరలోనే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు ప్రారంభిస్తామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించానన్నారు. మొత్తం మూడు కారిడార్లు విమానాశ్రయానికి కలిపేలా రెండో దశ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రెండో దశలో ఆరు కారిడార్లతో 116.4 కిలోమీటర్లు ప్లాన్ చేశామని తెలిపారు. ప్రస్తుతం ఐదు కారిడార్లకు డీపీఆర్‌లు సిద్ధం చేసి పంపించామన్నారు. మేడ్చల్ వైపు కారిడార్ కోసం డిమాండ్లు వస్తున్నాయన్నారు. మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టిందన్నారు. రెండో దశ పూర్తయితే మరింత పురోగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మొదటి దశ మెట్రో రైలు నిర్మాణం సమయంలో తన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

నాడు అలా చేసిన వాళ్లే నేడు పూలదండలతో సత్కరిస్తున్నారని చెప్పారు. ముంబై, చెన్నైలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మెట్రో రైలును విస్తరిస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మన నగరంలో విస్తరణ లేకపోవడం వల్ల మూడో స్థానంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. మొత్తం మూడు కారిడార్లు విమానాశ్రయానికి కలిపేలా రెండో దశ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మెట్రో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, తర్వాత స్థానంలో హైదరాబాద్ ఉందని వెంటనే మెట్రో విస్తరించకపోతే 9వ స్ధానానికి పడిపోయే ప్రమాదం ఉందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.

Tags:    
Advertisement

Similar News