కిషన్‌రెడ్డి...మరీ ఇన్ని అబద్ధాలా?

Advertisement
Update:2022-10-29 10:59 IST

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా అబద్దాలు చెబుతున్నారు. ఫాంహౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ బేరసారాల వ్యవహారం బయటపడేసరికి ఏమిచేయాలో కమలనాధుల‌కు దిక్కుతోచడం లేదు. ఎంతో గుట్టుగా పనికానిచ్చేద్దామని అనుకున్నా.. వీళ్ళ ఆటలు సాగలేదు. గుట్టు రట్టయ్యేసరికి కిషన్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. బెడిసికొట్టిన తమ వ్యూహాన్ని సమర్ధించుకునేందుకు పదే పదే కొన్ని పడికట్టు మాటలను వినిపిస్తున్నారు.

ఇంతకీ అవేమిటంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని, నలుగురు ఎమ్మెల్యేలను కొన్నంత మాత్రాన తమకొచ్చేది ఏమిటి? అంటు ఎదురుదాడి మొదలుపెట్టారు. తమ పార్టీలోకి ఎమ్మెల్యేల‌ను చేర్చుకోవాలని అనుకుంటే రాజీనామాలు చేయించి తీసుకుంటామంటు గొప్పగా చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారాన్ని చూపిస్తున్నారు.

ఇక్కడే కిషన్ రెడ్డి అబద్ధాలన్నీ బయటపడుతున్నాయి. ఇప్పటివరకు బీజేపీ కర్నాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గోవా, మణిపూర్, పాండిచ్చేరి, సిక్కిం రాష్ట్రాల్లో కాంగ్రెస్, జేడీఎస్ లేదా అక్కడి ప్రాంతీయ పార్టీల ఎమ్మెల్యేల‌ను లాగేసుకున్నది. పై రాష్ట్రాల్లో ఏ ఎమ్మెల్యేతో కూడా రాజీనామాలు చేయించలేదు. అధికారంలోకి వచ్చే అవకాశాలున్న రాష్ట్రాల్లో ఎక్కడ కూడా రాజీనామాలు చేయించకుండానే ప్రలోభాలకు గురిచేసి లాగేసుకున్న విషయం దేశమంతా చూసింది. కర్నాటక, మధ్యప్రదేశ్, గోవా, పాండిచ్ఛేరిలో ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్యేల‌ను లాగేసుకోవటం ద్వారానే ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది లేదా సుస్ధిరం చేసుకుంది.

ఇక బెంగాల్లో అయితే ప్రభుత్వంలోకి వచ్చేయటం ఖాయమన్న ఉద్దేశంతోనే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 29 మంది ఎమ్మెల్యేల‌ను లాగేసుకుంది. ఢిల్లీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) ఎమ్మెల్యేల కోసం వేసిన వల బయటపడేటప్పటికి సర్దుకున్నది. తెలంగాణాలో మాత్రం రాజగోపాల్‌తో రాజీనామా చేయించింది? ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద జనాల్లో వ్యతిరేకత ఉందని చూపించేందుకు, కేసీఆర్‌పై మైండ్ గేమ్ ఆడేందుకు రాజీనామా చేయించిందంతే.

తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశముంటే ఇక్కడా రాజీనామాల సంగతే ఎత్తుండేదికాదు. నిజంగానే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి తీసుకునేట్లయితే అసలు కర్నాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్, పాండిచ్చేరిలో బీజేపీ ప్రభుత్వాలు ఉండేవేకావు. మొత్తానికి దొరికిన తర్వాత సమర్థించుకోవటానికి కిషన్ రెడ్డి బాగానే అబద్ధాలు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News