తెలంగాణ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించిన యునిసెఫ్
తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు ఎంతో బాగున్నాయని పేర్కొన్న UNICEF మిడ్ వైఫరీలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచినట్లు ట్వీట్‌లో తెలిపింది. పురుడు సమయంలో తల్లులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పాజిటివ్ బర్త్ ఎక్స్‌పీరియన్స్ కలిగే రీతిలో మిడ్‌వైవ్స్‌కు శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ప్రశంసించింది.
గౌరవప్రదమైన, సహజమైన ప్రసవాలను ప్రోత్సహించడానికి, మాతా, శిశు మరణాలు తగ్గించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ (UNICEF) ఇండియా ప్రశంసలు కురిపించింది.
ఈ మేరకు హైదరాబాద్‌లోని ఏరియా హాస్పిటల్‌లో మిడ్ వైవ్స్ సహాయంతో తల్లి సురక్షితంగా ప్రసవించిన పసికందు చిత్రాన్ని శుక్రవారం యూనిసెఫ్, ఇండియా ట్విట్టర్‌లో షేర్ చేసింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అద్భుతమని UNICEF కొనియాడింది. సురక్షిత డెలివరీల కోసం సిబ్బందికి మిడ్ వైఫరీ కోర్సులో శిక్షణ ఇస్తున్న తీరుపై ప్రశంసల జల్లు కురిపించింది.
తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు ఎంతో బాగున్నాయని పేర్కొన్న UNICEF మిడ్ వైఫరీలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచినట్లు ట్వీట్‌లో తెలిపింది. పురుడు సమయంలో తల్లులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పాజిటివ్ బర్త్ ఎక్స్‌పీరియన్స్ కలిగే రీతిలో మిడ్‌వైవ్స్‌కు శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ప్రశంసించింది. తెలంగాణలో అందిస్తున్న ప్రసూతి సేవలు అద్భుతంగా ఉన్నాయని, సుఖ ప్రసవాలు జరిగేందుకు ఇవి దోహదం చేస్తున్నాయని పేర్కొంది.తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు ఎంతో బాగున్నాయని పేర్కొన్న UNICEF మిడ్ వైఫరీలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచినట్లు ట్వీట్‌లో తెలిపింది. పురుడు సమయంలో తల్లులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పాజిటివ్ బర్త్ ఎక్స్‌పీరియన్స్ కలిగే రీతిలో మిడ్‌వైవ్స్‌కు శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ప్రశంసించింది.