తెలంగాణ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 783 పోస్టులు

రాష్ట్రంలో ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ అయ్యాయి. వీటిలో గ్రూప్-1కు చెందిన 503, గ్రూప్-4కు చెందిన 9,168 పోస్టులు ఉన్నాయి.

Advertisement
Update:2022-12-29 20:04 IST

తెలంగాణలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుక అందించింది. ఎన్నోళ్లుగానో ఎదురు చూస్తున్న గ్రూప్-2 పోస్టుల కోసం టీఎస్‌పీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సారి గ్రూప్-2 కింద 783 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో వివిధ శాఖలకు చెందిన ఖాళీలు ఉన్నాయి. కాగా, జనవరి 18 నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో గ్రూప్-2 కింద 1032 పోస్టులను భర్తీ చేసింది.

రాష్ట్రంలో ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ అయ్యాయి. వీటిలో గ్రూప్-1కు చెందిన 503, గ్రూప్-4కు చెందిన 9,168 పోస్టులు ఉన్నాయి. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే పూర్తయ్యింది. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించిన ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక గ్రూప్-4 భర్తీ ప్రక్రియ ఈ నెల 28నే ప్రారంభం కావల్సి ఉన్నది. కానీ సాంకేతిక కారణాలతో డిసెంబర్ 30కి వాయిదా వేశారు.

హాస్ట‌ల్ వార్డెన్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. హార్టిక‌ల్చ‌ర్, వెట‌ర్న‌రీ శాఖ‌ల్లో కూడా కొలువుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ్డాయి. మ‌రోవైపు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క్రియ కొన‌సాగిస్తోంది. పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌లో భాగంగా ఫిజిక‌ల్ ఈవెంట్స్ కొన‌సాగుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News