ఢిల్లీలో సీఎం రేవంత్ మాటకు విలువ లేదు : కేటీఆర్

12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు అధినేత హాజరవుతారని కేటీఆర్ తెలిపారు.;

Advertisement
Update:2025-03-10 14:31 IST

ఈనెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారని, అందుకే ఢిల్లీలో రేవంత్ మాటకు విలువ లేకుండా పోయిందని కేటీఆర్ వివరించారు.ఎక్కే విమానం, దిగే విమానం తప్ప రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలైనా పూర్తి స్థాయి మంత్రి వర్గం లేదని అన్నారు. రేవంత్ వెనుక కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లున్నారని, వేల కోట్ల స్కాం కోసం ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని తెలిపారు.

వరంగల్ ఎయిర్ పోర్టు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము ఎంతో కృషి చేశామని కేటీఆర్ చెప్పారు. కానీ తామే ఎయిర్ పోర్టు తెచ్చామని కాంగ్రెస్ వాళ్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. శాసన సభ సమావేశలు జరుగుతుండగానే, ఈ-కార్ రేసింగ్ కేసులో తనకు మరోసారి నోటీసులు ఇస్తారని భావిస్తున్నానని కేటీఆర్ వెల్లడించారు. అయితే అదొక లొట్టపీసు కేసని, దాని గురించి భయపడబోనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో నేడు అసెంబ్లీకి కేటీఆర్‌ వచ్చారు. నామినేషన్‌ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. శ్రవణ్‌ను 2023లోనే ఎమ్మెల్సీగా కేసీఆర్‌ నామినేట్‌ చేశారు. అప్పుడు బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంది. శ్రవణ్‌ బీఆర్‌ఎస్‌ను వదిలిపెట్టి వెళ్లి ఉంటే ఇప్పటికే చట్ట సభల్లో అడుగుపెట్టేవాడు. కానీ, బీఆర్‌ఎస్‌పై నమ్మకంతో పార్టీలోనే ఉన్నాడు.

Tags:    
Advertisement

Similar News