రద్దైన‌, వాయిదా వేసిన పరీక్షలను మేలో నిర్వహించాలని TSPSC నిర్ణయం

గురువారం సమావేశమైన కమిషన్ పరీక్షల నిర్వహణ తేదీలపై చర్చించింది. తేదీలపై ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ మే నెలలో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.

Advertisement
Update:2023-03-24 07:20 IST

పేపర్ లీకేజ్ వ్యవహార‍ం వల్ల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రద్దు చేసిన, వాయిదా వేసిన పరీక్షలతో సహా రాబోయే రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.

గురువారం సమావేశమైన కమిషన్ పరీక్షల నిర్వహణ తేదీలపై చర్చించింది. తేదీలపై ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ మే నెలలో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.

“పరీక్ష తేదీలు, వాటిని ఎలా నిర్వహించాలనే దానిపై సమావేశంలో చర్చించారు. శుక్రవారం తేదీలు ఖరారు కానున్నాయి. పరీక్షలు మే నెలలో ప్రారంభమవుతాయి, ”అని TSPSC వర్గాలు తెలిపాయి.

ప్రశ్నాపత్రం లీక్ కావడంతో, TSPSC ఇంతకుముందు AEE, AE , గ్రూప్-I ప్రిలిమినరీ పరీక్షలకు నిర్వహించిన రిక్రూట్‌మెంట్ పరీక్షలను రద్దు చేసింది. TPBOలు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పరీక్షలను వాయిదా వేసింది. కాగా జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించాలని TSPSC నిర్ణయించింది.

Tags:    
Advertisement

Similar News